పన్ను చెల్లించాలని నోటీసులు... 30 వేల మంది టీసీఎస్ ఉద్యోగులకు ఐటీ శాఖ షాక్
- టీడీఎస్‌లో వ్యత్యాసాల కారణంగా నోటీసులు
- సీనియరిటీని బట్టి రూ.1 లక్ష వరకు పన్ను డిమాండ్ నోటీసు
- సాఫ్ట్‌వేర్‌లో పొరపాటు కారణంగా నోటీసులు?
- అప్పుడే చెల్లింపులు చేయవద్దని ఉద్యోగులకు టీసీఎస్ సూచన
కారణం అదేనా?
సాఫ్ట్‌వేర్‌లో పొరపాటు కారణంగా టీడీఎస్‌కు సంబంధించిన వివరాలు ఆదాయపు పన్ను శాఖ పోర్టల్‌లో సరిగ్గా అప్ డేట్ కాకపోవడమే ఈ పరిస్థితికి కారణమని చెబుతున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి పన్ను చెల్లింపుదారులు చెల్లించిన టీడీఎస్‌కు ఎలాంటి రికార్డులు లేకపోవడంతో ఐటీ చట్టం సెక్షన్ 143(1)కి లోబడి సెప్టెంబర్ 9న ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది.
చెల్లింపులు జరపవద్దని ఉద్యోగులకు టీసీఎస్ సూచన
ఐటీ శాఖ నోటీసులపై టీసీఎస్ స్పందించింది. ఈ నోటీసులకు స్పందించి ఎలాంటి చెల్లింపులు జరపవద్దని ఉద్యోగులకు అంతర్గతంగా సమాచారం ఇచ్చింది. సంస్థ నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు చెల్లింపులు చేయవద్దని పేర్కొంది. ఈ అంశానికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ అధికారులతో చర్చిస్తున్నామని తెలిపింది. త్వరలో సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.