ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. తెలంగాణ డీజీపీ జితేందర్ హెచ్చరిక!
విద్వేషాలను రెచ్చగొడితే ఏమాత్రం సహించబోమని హెచ్చరించారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తే ఊరుకోబోమని అన్నారు. కాగా, ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న వివాదం గురువారం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. చివరికి ఈ వివాదం పలువురు బీఆర్ఎస్ కీలక నేతల అరెస్ట్‌ల వరకు వెళ్లింది.