గణేశ్ నిమజ్జనం... పోలీస్ కమిషనర్‌కు రాజాసింగ్ లేఖ
- మద్యం సేవించి నిమజ్జనంలో పాల్గొంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
- నిమజ్జనం సమయంలో ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకోవాలని సూచన
- నిమజ్జనానికి ఎవరూ మద్యం సేవించి రావొద్దన్న రాజాసింగ్
వినాయక నిమజ్జనానికి ఎవరు కూడా మద్యం సేవించి రావొద్దని రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. నిమజ్జన కార్యక్రమం భక్తిభావంతో జరగాలని సూచించారు. మద్యం తాగి ఇష్టారీతిన ప్రవర్తించే వారిని ఉపేక్షించరాదని లేఖలో పేర్కొన్నారు. ధర్మద్రోహులు కూడా ఉంటారని, వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని కోరారు.