హైదరాబాద్‌లోని శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్
- ఇకపై నగరంలో ప్రతి రోజూ లడ్డూ ప్రసాదం విక్రయాలు
- హిమాయత్‌నగర్ లిబర్టీ, జూబ్లిహిల్స్‌లోని టీటీడీ దేవస్థానాల్లో అమ్మకం
- కీలక ప్రకటన చేసిన టీటీడీ
రూ.50కి ఒక లడ్డూ చొప్పున భక్తులకు శ్రీనివాసుడి లడ్డూ ప్రసాదం విక్రయించనున్నట్టు ప్రకటించారు. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆలయాల్లో లడ్డూ విక్రయాలు జరుగుతాయని వివరించారు. కాగా గతంలో శనివారం, ఆదివారాల్లో మాత్రమే లడ్డూ ప్రసాదాన్ని విక్రయించేవారు. అయితే శ్రీవారి లడ్డూ విక్రయంలో టీటీడీ నూతన పద్దతిని ఆచరణలోకి తీసుకొచ్చిందని అధికారులు తెలిపారు.