నాగార్జునసాగర్ కు కొనసాగుతున్న వరద ప్రవాహం... 24 గేట్లు ఎత్తిన అధికారులు

Flood stream continue to Nagarjuna Sagar project
  • ఎగువ ప్రాంతాల్లో వర్షాలు
  • కృష్ణా నది పోటెత్తుతున్న వైనం
  • నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో 2.63 లక్షల క్యూసెక్కులు
  • 2.21 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు
కృష్ణా నది ఇంకా ఉద్ధృతంగానే ప్రవహిస్తోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దాంతో అధికారులు సాగర్ ప్రాజెక్టులో 24 గేట్లు ఎత్తి 2.21 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో 2.63 లక్షల క్యూసెక్కులుగా ఉంది. 

సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా... ప్రస్తుతం ప్రాజెక్టులో 311.4 టీఎంసీల నీరు ఉంది. మహారాష్ట్ర, కర్ణాటకలో ఇప్పటికీ వర్షాలు కురుస్తుండడంతో కృష్ణా నది పోటెత్తుతోంది.
Advertisement
Nagarjuna Sagar
Flood
Krishna River

More Telugu News