ఉక్రెయిన్-రష్యా వివాదం పరిష్కారానికి సిద్ధంగా ఉన్న ఏ దేశాన్నైనా స్వాగతిస్తాం: అమెరికా
- ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ పర్యటన నేపథ్యంలో అమెరికా కీలక ప్రకటన
- ఉక్రెయిన్ ప్రజల హక్కులకు అనుగుణంగా పనిచేయాలని పిలుపు
- ఇటీవలే మోదీతో ఫోన్లో మాట్లాడిన అధ్యక్షుడు బైడెన్
కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 23న ఉక్రెయిన్లో చారిత్రాత్మక పర్యటన చేశారు. ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు. రష్యాతో వివాదం ముగింపునకు భారత్ తనవంతు సహకారాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు. కాగా మోదీ ఉక్రెయిన్ నుంచి వచ్చిన తర్వాత ఆయనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్ చేసి మాట్లాడారు.