హిమాలయ మంచు పొరల కింద ఎన్ని వందల రకాల వైరస్ లో!
- హిమాలయ మంచు పొరల్లో ప్రాచీన వైరస్‌ను గుర్తించిన శాస్త్రవేత్తలు
- అమెరికాలోని ఓహియా స్టేట్ యూనివర్శిటీ ప్రొఫెసర్ జీ పింగ్ జాంగ్ నేతృత్వంలో అధ్యయనం
- నేచర్ జియోసైన్స్ జర్నల్ లో వివరాలను వెల్లడించిన శాస్త్రవేత్తలు
వేల సంవత్సరాల నుండి పేరుకుపోయిన మంచుగడ్డల్లోని పొరలను అధ్యయనం చేసేందుకు ఐస్ కోర్‌లను డ్రిల్ చేసి తీసిన శ్యాంపిల్స్‌ను శాస్త్రవేత్తలు పరీక్షించారు. గులియా గ్లేసియర్‌లోని సుమారు 310 మీటర్ల లోతైన ఐస్ కోర్ నుండి మంచు శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలు చేశారు. ప్రతి పొరలోనూ కీలకమైన పర్యావరణ సమాచారం ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. నూతన టెక్నాలజీ ద్వారా వైరస్‌లకు చెందిన డీఎన్ఏలను పరీక్ష చేయగా, సుమారు 1705 రకాల విభిన్న వైరస్ జాతులను గుర్తించారు.