ఏపీ, తెలంగాణలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన సోనూసూద్
- మంచినీరు, ఆహారం, మెడికల్ కిట్స్, తాత్కాలిక షెడ్స్ ఏర్పాటు చేసేందుకు కృషి
- తెలుగు రాష్ట్రాలు వరదలతో యుద్ధం చేస్తున్నాయని ఎక్స్ వేదికగా సోనూ సూద్ ట్వీట్
- తన చారిటీ ద్వారా నిధులు సమకూర్చే ప్రయత్నం
ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వర్షాలు, వరదలతో యుద్ధం చేస్తున్నాయని, ఇలాంటి అవసరమైన సమయంలో వారికి అండగా ఉంటామని సోనూసూద్ పేర్కొన్నారు. ప్రజలు తమ తమ సహాయ అభ్యర్థనలను పంపించేందుకు సోనూసూద్‌కు చెందిన చారిటీ ఫౌండేషన్ ఈ-మెయిల్‌ను ఇచ్చారు. తద్వారా ఆయన సహాయం చేయడంతో పాటు తన చారిటీ ద్వారా వనరులను సమకూర్చే ప్రయత్నం చేస్తున్నారు.