వర్షాలు, వరదల ఎఫెక్ట్... విజయవాడ పరిధిలో పలు రైళ్లు రద్దు
- ఏపీ, తెలంగాణలో వర్షాలు, వరదల బీభత్సం
- రవాణా రంగంపై తీవ్ర ప్రభావం
- కొన్ని రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
తిరుపతి మీదుగా వెళ్లాల్సిన పలు రైళ్లు రద్దయ్యాయి. కొన్ని రైళ్లను తెనాలి మీదుగా దారి మళ్లించారు. కృష్ణా ఎక్స్ ప్రెస్, శబరి, విశాఖ స్పెషల్ ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. సికింద్రాబాద్-తిరుపతి మధ్య తిరిగే పద్మావతి ఎక్స్ ప్రెస్ ఐదున్నర గంటలు ఆలస్యంగా నడుస్తోంది.
విశాఖపట్నం-నాందేడ్, నాందేడ్-విశాఖపట్నం రైళ్లను కూడా రద్దు చేశారు. చెన్నై సెంట్రల్-శ్రీ మాతా వైష్ణోదేవి కత్రా ఎక్స్ ప్రెస్ ను విజయవాడ, విశాఖ, విజయనగరం మీదుగా దారి మళ్లించారు.




