పారాలింపిక్స్ లో భారత్ కు మరో రెండు మెడల్స్
- పారిస్ లో ఉత్సాహభరితంగా పారాలింపిక్స్ పోటీలు
- పురుషుల విభాగం సింగిల్స్ లో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్న నితేశ్ కుమార్
- మహిళల సింగిల్స్ లో తులసిమతి మురుగేశన్కు రజిత పతకం
మహిళల సింగిల్స్ విభాగంలో ఎస్యూ 5 ఫైనల్ లో తులసిమతి మురుగేశన్ రజత, పురుషుల విభాగంలో మనీశ్ రామ్ దాస్ కాంస్య పతకాలు సాధించారు. గోల్డ్ మెడల్ మ్యాచ్ లో తులసిమతి 17-21, 10-21తో యాంగ్ క్విక్సియా (చైనా) చేతిలో ఓటమి చవిచూసింది. కాంస్య పతక పోటీలో మనీషా 21-12, 21 -8 తో కేథరీన్ రోసెన్గ్రేన్ (డెన్నార్క్) ను చిత్తు చేసింది. దీంతో సోమవారం భారత్ పతకాల సంఖ్య 11కి చేరింది.