కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ గడువు పొడిగింపు
- మరో రెండు నెలలు పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం
- జూన్ నెలలో ఓసారి, ఇప్పుడు మరోసారి పొడిగింపు
- అక్టోబర్ నెలాఖరుతో ముగియనున్న తాజా గడువు
రేవంత్ సర్కారు మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలపై విచారణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్‌ను వేసింది. కమిషన్ గడువు తొలుత జూన్ నెలలో ముగిసింది. అప్పుడు రెండు నెలలు పొడిగించారు. ఇప్పుడు మరో రెండు నెలలు పొడిగించారు. విచారణ పూర్తి కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.