ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: నారా లోకేశ్
- భారీ వర్షాల నేపథ్యంలో పలు సూచనలు చేసిన నారా లోకేశ్
- అలర్ట్ మెసేజ్ లు గమనిస్తూ తగిన రక్షణ చర్యలు తీసుకోవాలన్న లోకేశ్
- వరద ప్రభావిత ప్రాంతాల్లో బయటకు రాకపోవడమే మంచిదని సూచన
వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రజలు బయటకు రాకుండా ఉండటమే మంచిదని పేర్కొన్నారు. కొండ చరియలు విరిగిపడే, ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికార యంత్రాంగం సూచించిన సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని తెలిపారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు సహాయక చర్యలకు తమ పూర్తి సహకారం అందించాలని సూచించారు. విపత్తుల కష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ ప్రజలకు అండగా ఉంటుందనే భరోసా కల్పించాలని స్పష్టం చేశారు.