కన్నడ స్టార్ హీరో దర్శన్ ను బళ్లారి జైలుకు తరలించిన అధికారులు
- పరప్పన అగ్రహార జైల్లో ఉన్న దర్శన్
- జైల్లో సిగరెట్ కాల్చుతున్న ఫోటోలు వైరల్
- దర్శన్ రాజభోగాలు అనుభవిస్తున్నాడంటూ తీవ్ర విమర్శలు
తాజాగా ఏసీపీ తంగప్ప ఆధ్వర్యంలో భారీ బందోబస్తు మధ్య దర్శన్ ను బళ్లారి జైలుకు తరలించారు. జైల్లో దర్శన్ తో పాటు ఉన్న ఆయన సహచరులను కూడా వివిధ జైళ్లకు తరలించారు. మరోవైపు జైల్లో దర్శన్ రాజభోగాలపై మూడు కేసులు నమోదు చేసినట్టు పోలీస్ కమిషనర్ దయానంద తెలిపారు. తన అభిమాని రేణుకస్వామి మర్డర్ కేసులో దర్శన్ విచారణ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.