మంకీపాక్స్ నిర్ధారణ కిట్ ఉత్పత్తి చేసిన ఏపీ మెడ్‌టెక్
- దేశీయంగా తొలి మంకీపాక్స్ టెస్టింగ్ కిట్‌ను రూపొందించిన విశాఖ మెడ్‌టెక్
- మంకీపాక్స్ ఆర్టీ పీసీఆర్ కిట్లకు అత్యవసర అంగీకారం తెలిపిన ఐసీఎంఆర్, సీడీఎస్‌సీవో
- రెండు వారాల్లో మార్కెట్లోకి తీసుకువస్తామని చెప్పిన సీఈవో జితేంద్ర శర్మ
ఎంపాక్స్ నిర్ధారణకు దేశీయంగా రూపొందించిన తొలి టెస్టింగ్ కిట్ ఇదేనని శనివారం మెడ్‌టెక్ ప్రకటించింది. ఈ కిట్ కు ఐసీఎంఆర్, సీడీఎస్‌సీవో నుండి అత్యవసర అంగీకారం లభించినట్లు సంస్థ ప్రకటించింది. ఆరోగ్య రంగంలో మన దేశ ప్రతిభకు ఇదే తార్కాణమని మెడ్‌టెక్ సీఈవో జితేంద్ర శర్మ తెలిపారు. రెండు వారాల్లో ఈ కిట్ ను మార్కెట్లో అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.