హైదరాబాద్లో భారీ వర్షం... హుస్సేన్ సాగర్లోకి భారీగా వరదనీరు
- జూబ్లీహిల్స్, బేగంపేట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం
- అప్రమత్తమైన జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
- హుస్సేన్ సాగర్ నుంచి 1600 క్యూసెక్కుల నీరు విడుదల
నగరంలో భారీ వర్షం కురవడంతో హుస్సేన్ సాగర్లోకి వరదనీరు వచ్చి చేరుతోంది. హుస్సేన్ సాగర్లో మంగళవారం మధ్యాహ్నం నాటికి నీరు దాదాపుగా ఫుల్ ట్యాంక్ లెవల్ కు చేరుకుంది. హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 514.75 అడుగులు కాగా, మధ్యాహ్నం సమయానికి 513.63 అడుగులకు నీరు చేరుకుంది. సాగర్లోకి 1850 క్యూసెక్కుల నీరు వస్తుండగా, గేట్లు ఎత్తి 1600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.