ఆస్కీ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు స్వీకరించిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్
- అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డీజీగా నిమ్మగడ్డ
- నిమ్మగడ్డ 1982 బ్యాచ్ ఐఏఎస్ అధికారి
- టీటీడీ ఈవోగా కూడా పని చేసిన నిమ్మగడ్డ
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ 1982 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ, ఏపీ గవర్నర్ కు ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఆ తర్వాత ప్రత్యేక కార్యదర్శిగా పని చేశారు. ఆ తర్వాత ఏపీ ఎన్నికల ప్రధానాధికారిగా బాధ్యతలు నిర్వర్తించారు. టీటీడీ ఈవోగా కూడా ఆయన పని చేశారు. ఆస్కీ కోర్ట్ ఆఫ్ గవర్నర్స్ సభ్యుడిగా కొనసాగిన నిమ్మగడ్డ తాజాగా అదే సంస్థ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు స్వీకరించారు.