వైద్యుల రక్షణ కోసం నేషనల్ టాస్క్ ఫోర్స్: సుప్రీంకోర్టు
- ఆర్జీ కర్ వైద్యురాలి హత్యాచారం కేసు విచారణలో భాగంగా ఏర్పాటు చేసిన సీజేఐ ధర్మాసనం
- మూడు వారాల్లో మధ్యంతర నివేదిక ఇవ్వాలని ఆదేశించిన సుప్రీం బెంచ్
- శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిని ఇబ్బంది పెట్టొద్దంటూ బెంగాల్ ప్రభుత్వానికి సూచన
టాస్క్ ఫోర్స్ లో ఎవరెవరు ఉన్నారంటే..
ఆసుపత్రులలో వైద్యుల రక్షణ ఏర్పాట్ల పరిశీలనకు ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కు సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్ సరైన్ నేతృత్వం వహిస్తారని సుప్రీంకోర్టు పేర్కొంది. డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి, డాక్టర్ ఎం. శ్రీనివాస్, డాక్టర్ ప్రతిమా మూర్తి, డాక్టర్ గోవర్ధన్ దత్ పూరి, డాక్టర్ సౌమిత్ర రావత్, ఢిల్లీ ఎయిమ్స్ ప్రొఫెసర్ అనితా సక్సేనా, ముంబయి మెడికల్ కాలేజీ డీన్ ప్రొఫెసర్ పల్లవి సప్రే, ఎయిమ్స్ న్యూరాలజీ డాక్టర్ పద్మ శ్రీవాస్తవ ఈ టాస్క్ ఫోర్స్ లో సభ్యులుగా ఉంటారని అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది. ఈ టాస్క్ ఫోర్స్ కు ఎక్స్ అఫీషియో మెంబర్లుగా కేంద్ర కేబినెట్ సెక్రెటరీ, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి, నేషనల్ మెడికల్ కమిషన్ చైర్ పర్సన్, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినర్స్ ప్రెసిడెంట్ ఉంటారని సుప్రీం కోర్టు వెల్లడించింది. మూడు నెలల్లో మధ్యంతర నివేదిక అందజేయాలని టాస్క్ ఫోర్స్ ను ఆదేశించింది.