హైదరాబాద్ లో రేపు మెగా జాబ్ మేళా.. వివరాలు ఇవిగో!

  • ఫార్మా, హెల్త్, ఐటీ తదితర విభాగాల్లో నియామకాలు
  • పదో తరగతి నుంచి డిగ్రీ, పీజీలు చేసిన వారికి అవకాశం
  • పెద్ద కంపెనీలు పాల్గొంటున్నాయని నిర్వాహకుల వెల్లడి
హైదరాబాద్ లోని నిరుద్యోగులకు శుభవార్త.. ఈ నెల 20 (మంగళవారం) నాంపల్లిలో మెగా జాబ్ మేళా జరగనుంది. పదో తరగతి నుంచి డిగ్రీ, పీజీలు పూర్తిచేసిన వారు ఈ మేళాలో పాల్గొనవచ్చు. ఇందులో ఫార్మా, హెల్త్, ఐటీ, బ్యాంకింగ్ సెక్టార్లకు సంబంధించిన పెద్ద పెద్ద కంపెనీలు పాల్గొంటున్నాయి. నాంపల్లిలోని రెడ్ రోజ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ వేదికగా జరిగే ఈ మేళాలో నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. రెజ్యుమె, విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లతో హాజరుకావాలని కోరారు. మేళాలో పాల్గొనాలనుకునే అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం, ఆసక్తి గల అభ్యర్థులు 8374315052 నంబర్‌లో సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు.

Job mela
Private jobs
Nampally
Hyderabad

More Telugu News