కర్ణాటకలో రగులుకున్న రాజకీయ వేడి.. యడియూరప్ప ఇంటికి వందలాదిమంది కాంగ్రెస్ కార్యకర్తలు
- ముడా కేసులో సీఎం సిద్దరామయ్యపై విచారణకు గవర్నర్ అనుమతి
- దానిని నిరసిస్తూ యడియూరప్ప ఇంటి ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు
- అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు
అప్రమత్తమైన పోలీసులు యడియూరప్ప ఇంటికి దారితీసే రోడ్డుపై బారికేడ్లు ఏర్పాటు చేసి వారిని అడ్డుకున్నారు. ఆపై అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వదిలిపెట్టారు. కేపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ నాగేంద్రగౌడ మాట్లాడుతూ గవర్నర్ నిర్ణయాన్ని ఖండించారు. యడియూరప్ప అంత పెద్ద ఎత్తున ఆస్తులు ఎలా సంపాదించారో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆయన కనుక షికారిపుర వస్తే కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనను ఘెరావ్ చేస్తారని హెచ్చరించారు.