పాకిస్థాన్ కు చేరిన మంకీపాక్స్.. భారత్ లో ఆందోళన
- ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్
- గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
- ఇప్పటి వరకు 30 వేలకు పైగా కేసుల నమోదు
ఇప్పుడు మంకీపాక్స్ వైరస్ మన పొరుగు దేశం పాకిస్థాన్ కు చేరింది. దీంతో మన దేశంలో కూడా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2022లో ఈ వైరస్ ప్రపంచాన్ని వణికించింది. అప్పుడు 116 దేశాల్లో వైరస్ వ్యాపించింది. ఆ సమయంలో లక్షకు పైగా కేసులు నమోదు కాగా... ఇండియాలో కూడా 30 కేసులను గుర్తించారు.