నేడు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్న సీఎం చంద్రబాబు
- సోమశిల జలాశయాన్ని పరిశీలించనున్న చంద్రబాబు
- ఈ మధ్యాహ్నం శ్రీసిటీలో పర్యటన
- 15 సంస్థల కార్యకలాపాలను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
అనంతరం ఈ మధ్యాహ్నం సత్యవేడులోని శ్రీసిటీలో ముఖ్యమంత్రి పర్యటిస్తారు. శ్రీసిటీలో 15 సంస్థల కార్యకలాపాలను చంద్రబాబు ప్రారంభిస్తారు. రూ. 900 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటయ్యే ఈ సంస్థల ద్వారా 2,740 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మరో 1,213 కోట్ల పెట్టుబడులకు సంబంధించి నాలుగు ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోనుంది. అనంతరం పలు కంపెనీల సీఈఓలతో చంద్రబాబు భేటీ అవుతారు.