ఏలూరులో దారుణం.. వివాహితపై సామూహిక లైంగికదాడి
- 15 రోజుల క్రితమే నగరానికి బాధిత కుటుంబం
- వివాహిత భర్తతో కలిసి మద్యం తాగిన యువకులు
- ఆపై అతడిని కొట్టి ఆమెను లాక్కెళ్లి అఘాయిత్యం
- నిందితులు ముగ్గురినీ అరెస్ట్ చేసిన పోలీసులు
చిన్నచిన్న పనులు చేసుకుంటూ జులాయిగా తిరిగే నగరానికి చెందిన ముగ్గురు యువకులు వీరికి పరిచయమయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి వివాహిత భర్తతో కలిసి మద్యం తాగారు. ఆ తర్వాత ముగ్గురూ కలిసి అతడిపై దాడిచేసి ఆయన భార్యను లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెపైనా దాడి చేశారు. మరోవైపు, యువకులు తన భార్యను లాక్కెళ్లడంతో నిస్సహాయుడైన భర్త రోడ్డుపైకి వచ్చి కేకలు వేశాడు. ఓ యువకుడికి విషయం చెప్పాడు. అతడు అక్కడికి వెళ్లే సరికి నిందితులు ముగ్గురూ పరారయ్యారు.
బాధిత మహిళ భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు ముగ్గురినీ అరెస్ట్ చేశారు. వీరిని చెంచు కాలనీకి చెందిన నూతిపల్లి పవన్, లంబాడీపేటకు చెందిన నారపాటి నాగేంద్ర, మరడాని రంగారావు కాలనీకి చెందిన గడ్డ విజయ్‌కుమార్ అలియాస్ నానిగా గుర్తించారు. కోర్టు వీరికి 14 రోజుల రిమాండ్ విధించింది.