తనయుడు, సోదరుడితో కలిసి శబరిమల అయ్యప్ప దర్శనానికి పెద్దిరెడ్డి... వీడియో ఇదిగో!
కాషాయ దుస్తుల్లో ఉన్న పెద్దిరెడ్డి తలపై ఇరుముడితో నడుస్తుండగా, పక్కనే మిథున్ రెడ్డి, వెనుకగా ద్వారకానాథరెడ్డి అనుసరించారు. ఈ విషయాన్ని పెద్దిరెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించారు. వీడియోను కూడా పంచుకున్నారు.
ఇటీవల ఎన్నికల్లో వైసీపీకి 11 ఎమ్మెల్యే స్థానాలు, 4 ఎంపీ స్థానాలు రాగా... పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి, తంబళ్లపల్లె నుంచి ఆయన సోదరుడు ద్వారకానాథరెడ్డి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా గెలిచారు.