మాజీ మంత్రి రోజాకు షాక్ .. 'ఆడుదాం ఆంధ్ర' నిధుల దుర్వినియోగంపై విచారణకు సీఐడీ ఆదేశం!
- ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో నిధుల దుర్వినియోగం అంటూ సీఐడీకి ఫిర్యాదు
- మాజీ మంత్రి రోజా, కృష్ణదాస్ లపై చర్యలు తీసుకోవాలంటూ వినతి
- ఫిర్యాదుపై స్పందించి కీలక ఆదేశాలు జారీ చేసిన సీఐడీ అదనపు డీజీ
ఆడుదాం ఆంధ్రా పేరుతో నిర్వహించిన క్రీడా పోటీల్లో జరిగిన నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఇటీవల క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సైతం ప్రకటించారు. దీంతో ఈ వ్యవహారంపై సీఐడీ విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని క్రీడాకారులు అంటున్నారు. ప్రభుత్వ చర్యలను మాత్రం వైసీపీ తప్పుబడుతోంది. ఎటువంటి అక్రమాలు జరగకపోయినా రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఇలా ఫిర్యాదులు చేసి విచారణలను కోరుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు.