SSLV D3: ఇస్రో మరో ఘనత.. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన ఎస్ఎస్ఎల్వీ డీ3

SSLV D3 successfully sent by ISRO
షార్ట్స్‌లో చూడండి
వరుస విజయాలతో దూసుకెళుతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ఘనతను సాధించింది. శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఎస్ఎస్ఎల్వీ డీ3ని విజయవంతంగా నింగిలోకి పంపింది. ఈ రాకెట్ ద్వారా 175 కిలోల ఈవోఎస్-08 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. విపత్తుల సమయంలో ఈ ఉపగ్రహం కీలక సమాచారాన్ని పంపిస్తుంది. ప్రకృతి విపత్తులతో పాటు అగ్ని పర్వతాలను కూడా ఈ శాటిలైట్ పర్యవేక్షిస్తుంది. మొత్తం 17 నిమిషాల పాటు రాకెట్ ప్రయోగం కొనసాగింది. 

ఈవోఎస్ శాటిలైట్ ను యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ లో అభివృద్ధి చేశారు. ఈ ఉపగ్రహంలో ఉండే ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ పేలోడ్ మిడ్ వేవ్, లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్ లో చిత్రాలను తీస్తుంది. ఈ శాటిలైట్ పంపించే సమాచారం విపత్తు నిర్వహణలో ఎంతో ఉపయోగపడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఉపగ్రహం ఏడాది పాటు పని చేస్తుంది.
Go Back to Shorts
SSLV D3
ISRO
EOS 08

More Telugu News