దూసుకుపోతున్న 'కమిటీ కుర్రోళ్లు'.. జోష్ లో నిహారిక
- కమిటీ కుర్రోళ్లు సినిమాకు భారీగా కలెక్షన్లు
- విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతున్న నిహారిక
- నంద్యాల, కర్నూలు ధియేటర్ లలో సందడి చేసిన నిహారిక
- రాయలసీమలోనూ ఊహించని ఆదరణకు సంతోషాన్ని వ్యక్తం చేసిన నిహారిక
తను నిర్మించిన కమిటీ కుర్రోళ్లు సినిమాను తెలుగు ప్రేక్షకులు విజయవంతం చేయడంపై నిర్మాత నిహారిక ధియేటర్ లను సందర్శించి నేరుగా ప్రేక్షకులను కలిసి అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల నంద్యాల, కర్నూల్ ధియేటర్ లను నిహారిక సందర్శించారు. సినిమా చూస్తున్న ప్రేక్షకులతో నేరుగా మాట్లాడారు. ఊహించని విధంగా తమ సినిమాకు రాయలసీమలోనూ వసూళ్లు బాగా రావడం గొప్ప విషయమని అన్నారు.
ఇంతటి ఆదరణ చూసి తాను షాకయ్యానని చెబుతూనే.. తన సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక నిహారిక ధియేటర్ లకు రాకతో మెగా అభిమానులు, జనసైనికులు సంబరాలు చేస్తూ ఆమెకు ఘన స్వాగతం పలికారు. మెగా హీరోలు వస్తే ఏ విధంగా అయితే స్వాగతం పలుకుతారో అదే రీతిలో నిహారికను స్వాగతించారు. దీంతో కమిటీ కుర్రోళ్లు సినిమా నిహారికను సంతోషంలో ముంచెత్తుతోంది.