తెలంగాణలో మరో మూడ్రోజులు వర్షాలు... ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

  • తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
  • ఆదిలాబాద్, జనగామ, హైదరాబాద్ తదితర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
  • ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని హెచ్చరిక
తెలంగాణలో మరికొన్నిరోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 

ఈరోజు నుంచి రేపటి వరకు రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి జిల్లాల్లో అక్కడక్కడా వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

శుక్రవారం నుంచి శనివారం వరకు, శనివారం నుంచి ఆదివారం వరకు తెలంగాణలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది.


More Telugu News

IMD Telangana Rain