మహిళా వైద్యులు రాత్రుళ్లు బయటకు వెళ్లకూడదన్న ఉత్తర్వులను వెనక్కి తీసుకున్న సిల్చార్ మెడికల్ కాలేజ్
- కోల్‌కతా ఘటన నేపథ్యంలో మహిళా వైద్యులు, ట్రైనీలు బయటకు వెళ్లొద్దని అస్సాం ప్రభుత్వం ఆదేశాలు
- మహిళలకు భద్రత కల్పించడం మాని ఇవేం ఆదేశాలంటూ సర్వత్ర విమర్శలు
- ఆదేశాలను వెనక్కి తీసుకున్నట్టు ప్రభుత్వ ప్రకటన
ఈ ఆదేశాలపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. మహిళలకు భద్రత కల్పించడం మానేసి ఇలా ‘స్త్రీ ద్వేషం’ నింపుకోవడం తగదంటూ ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఎవరూ బయటకు వెళ్లకుండా రూముల్లోనే ఉండాలని చెప్పడం మాని క్యాంపస్‌లో భద్రత పెంపుపై దృష్టిసారించాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఈ నెల 12న జారీచేసిన ఈ ఆదేశాలను రద్దు చేసినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. జాతీయ వైద్య కమిషన్, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా త్వరలోనే నూతన మార్గదర్శకాలను విడుదల చేస్తామని పేర్కొంది.