సుంకిశాల ఇష్యూ... అధికారులపై వేటు వేసిన ప్రభుత్వం
- ప్రాజెక్ట్ గేటు, రక్షణ గోడ ప్యానల్ కూలిపోవడంపై ప్రభుత్వం సీరియస్
- ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్‌పై బదిలీ వేటు
- నలుగురు అధికారుల సస్పెన్షన్
సుంకిశాల ఘటనపై అంతర్గత విచారణ జరిగింది. విచారణ జరిపిన కమిటీ... నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఈ నివేదిక ఆధారంగా విధుల్లో నిర్లక్ష్యం వహించిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంది. అలాగే నిర్మాణ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.