Rajasthan: భార్య కాళ్లను తాడుతో బైక్‌కు కట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లిన భర్త.. వీడియో ఇదిగో!

Man dragging his wife Sumitra tied up with motorcycle through village
  • రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో అమానవీయం
  • సోదరి వద్దకు వెళ్తానన్నందుకు దారుణం
  • వీడియో వైరల్ కావడంతో నిందితుడి అరెస్ట్
మద్యం మత్తులో భార్యను చితకబాదిన ఓ వ్యక్తి.. ఆపై తాడుతో ఆమెను తన బైక్‌కు కట్టి ఊరంతా ఈడ్చుకెళ్లాడు. ఈ అమానవీయ ఘటన రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్తా వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

నాగౌర్‌‌లోని నహర్‌సింగ్‌పూర్ గ్రామానికి చెందిన ప్రేమ్‌రామ్ మేఘ్‌వాల్ (32) భార్య సుమిత్ర జైసల్మేర్‌లోని తన సోదరి వద్దకు వెళ్లాలని అనుకుంది. ఇదే విషయాన్ని భర్తకు చెబితే అతను నిరాకరించాడు. ఇది ఇద్దరి మధ్య గొడవకు కారణమైంది. ఆపై మద్యం తాగొచ్చిన ప్రేమ్‌రామ్ భార్య కాళ్లను తాడుతో తన బైక్‌కు కట్టేసి ఈడ్చుకెళ్లాడు. 

దీనిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. దీంతో స్పందించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కాగా, ప్రస్తుతం బంధువుల ఇంట్లో ఉన్న బాధితురాలు భర్తపై ఇప్పటి వరకు ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు.
Rajasthan
Nagaur
Crime News

More Telugu News