వివాహిత ఆత్మహత్య కేసు .. భర్త, అత్త, ఆడపడుచుకు యావజ్జీవ శిక్ష
- వరకట్న వేధింపులు తాళలేక రంగారెడ్డి జిల్లాలో సునీత ఆత్మహత్య
- నిందితులను దోషులుగా తేల్చి యావజ్జీవశిక్ష విధించిన న్యాయస్థానం
- మూడేళ్లలోనే తీర్పు
వివాహం అయిన రెండేళ్ల నుంచి సునీతను భర్త సురేందర్, అత్త పీక్లి, అడపడుచు సంతోష అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలు పెట్టారు. ఈ వేధింపులు తాళలేక 2021 జనవరి 10వ తేదీన సునీత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
తాజాగా ఈ కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించిన సెషన్స్ కోర్టు న్యాయమూర్తి నిందితులను దోషులుగా తేల్చి, ముగ్గురికీ యావజ్జీవ జైలుశిక్షతో పాటు రూ.50వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.