మహిళలకు టీజీఎస్ఆర్‌టీసీ గుడ్‌న్యూస్
- ఈ నెల 19వ తేదీన రాఖీ పండుగ
- దూర ప్రాంతాల్లోని తమ సోదరులకు రాఖీలు పంపేందుకు వీలుగా కార్గో సెంటర్లలో ప్రత్యేక కౌంటర్లు
- కార్గో సెంటర్లలో బుక్ చేసిన 24 గంటల్లోనే రాఖీలను డెలివరీ చేసే విధంగా చర్యలు
రాఖీలతో పాటు స్వీట్ బాక్సులు, బహుమతులు కూడా పంపే అవకాశం కల్పించింది. తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటక తదితర రాష్ట్రాలకు రాఖీలను పంపించుకోవచ్చని ఆర్‌టీసీ అధికారులు వెల్లడించారు.
కార్గో సెంటర్లలో బుక్ చేసిన 24 గంటల్లోనే రాఖీలను డెలివరీ చేసే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అయితే, రాఖీల రవాణా ధర ఇంకా ఖరారు కాలేదు. ధరల విషయంలో ఎల్లుండి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.