డెమోక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్ధిగా మిన్నెసొటా గవర్నర్ టిమ్ వాల్జ్ ఎంపిక
- వెస్ట్ పాయింట్ కు చెందిన చిన్న పట్టణం నెబ్రస్కాలో పెరిగిన వాల్జ్
- ఆర్మీ నేషనల్ గార్డ్ గా 24 ఏళ్లు, చట్ట సభలో 12 ఏళ్లు సేవలందించిన వాల్జ్
- అధ్యక్ష అభ్యర్ధిగా అధికారికంగా హారిస్ ఖరారు .. అనుకూలంగా 99 శాతం ఓట్లు
వెస్ట్ పాయింట్ కు చెందిన చిన్న పట్టణం నెబ్రస్కాలో పెరిగిన వాల్జ్ సామాజిక శాస్త్ర ఉపాధ్యాయుడుగా, ఫుట్ బాల్ కోచ్ గా పని చేశారు. రాజకీయాల్లోకి రాక ముందు వరకూ మిన్నెసొటాలోని మంకాటో వెస్ట్ హైస్కూల్ యూనియన్ మెంబర్ గా వ్యవహరించారు. మిన్నెసొటా జిల్లా నుంచి 2006లో తొలిసారి కాంగ్రెస్ కు ఎన్నికయ్యారు. అమెరికా చట్ట సభలో 12 ఏళ్ల పాటు సేవలు అందించిన వాల్జ్ .. 2018 లో మిన్నెసొటా గవర్నర్ గా ఎన్నికయ్యారు. రిపబ్లికన్ పార్టీని ఎండగట్టడంలో తనదైన వ్యూహాలతో ముందుకు వెళ్లి అందరి దృష్టిని ఆకర్షించిన వాల్జ్ .. ఆర్మీ నేషనల్ గార్డ్ లో 24 ఏళ్లు పని చేశారు. ఆయన ఎంపిక ద్వారా దేశ పశ్చిమ మధయ్ ప్రాంతంలో డెమోక్రటిక్ పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుందని భావిస్తున్నారు.
కాగా, డెమోక్రటిక్ పార్టీ తరుపున అధ్యక్ష అభ్యర్ధిగా కమలా హారిస్ లాంఛనంగా ఖరారు అయ్యారు. హారిస్ నామినేషన్ సోమవారం రాత్రి అధికారికమైంది. ఆమెకు అనుకూలంగా 99 శాతం మంది పార్టీ ప్రతినిధుల ఓట్లు లభించాయి. దేశ వ్యాప్తంగా సుమారు 4,567 మంది హారిస్ ను బలపరుస్తూ ఓటు వేశారు.