బంగ్లాదేశ్ సంక్షోభం.. అఖిలపక్ష భేటీకి కేంద్రం పిలుపు
- పొరుగుదేశంలో నెలకొన్న సంక్షోభంపై చర్చించనున్న అఖిలపక్షం
- ప్రభుత్వం తరపున పాల్గొననున్న మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, కిరణ్ రిజిజు
- ఉదయం 10కి మీటింగ్ అంటూ అన్ని పార్టీలకు సమాచారం
ఈ సమావేశంలో ప్రభుత్వం తరపున హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు పాల్గొంటారని తెలిసింది. మరోవైపు బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితిని విదేశాంగమంత్రి జైశంకర్ సోమవారం రాత్రే ప్రధాని మోదీకి వివరించారు. ఈ నేపథ్యంలో షేక్ హసీనాను మోదీ కలుస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు.