పాఠశాలల పరిశుభ్రత కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!
- స్కూళ్లలో పరిశుభ్రత కోసం నిధులు కేటాయిస్తూ నిర్ణయం
- 'అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ'కి స్కూళ్ల పరిశుభ్రత బాధ్యతలు అప్పగింత
- విద్యార్థుల సంఖ్య ఆధారంగా రూ.3 వేల నుంచి రూ.20 వేల వరకు గ్రాంట్
30 లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలకు రూ.3 వేలు, 31 నుంచి 100 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు రూ.6 వేలు, 101 నుంచి 200 మంది ఉంటే రూ.8 వేలు, 251 నుంచి 500 లోపు విద్యార్థులు ఉంటే రూ.12 వేలు, 501 నుంచి 750 మంది వరకు విద్యార్థులు ఉంటే రూ.15 వేలు, 750 కంటే ఎక్కువ మంది ఉంటే రూ.20 వేల చొప్పున గ్రాంట్ ఇవ్వనుంది. మొత్తం 10 నెలల కాలానికి ఒకేసారి నిధులు విడుదల చేస్తారు. తెలంగాణలోని పాఠశాలల్లో పరిశుభ్రత కొరవడిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.