పుష్ప-2 గురించి కీలక సమాచారం వెల్లడించిన బన్నీ వాసు

  • పుష్ప-2 చిత్రంపై సోషల్ మీడియాలో వార్తలు
  • సోషల్ మీడియాలో ప్రచారాన్ని నమ్మవద్దన్న బన్నీ వాసు
  • కథలో మార్పుల వల్లే పుష్ప-2 చిత్రీకరణ ఆలస్యం అవుతోందని స్పష్టీకరణ
  • అనుకున్నట్టే డిసెంబరులోనే పుష్ప-2 ప్రేక్షకుల ముందుకు వస్తుందని వెల్లడి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప భారీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప-2. తాజాగా, పుష్ప-2 చిత్రం గురించి నిర్మాత బన్నీ వాసు ఆసక్తికర సమాచారం అందించారు. 

పుష్ప-2 చిత్రం గురించి సామాజిక మాధ్యమాల్లో అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయని, వాటిని నమ్మవద్దని స్పష్టం చేశారు. పుష్ప చిత్రానికి రెండో భాగం తీయాలని నిర్ణయించుకున్నప్పుడే కథలో చాలా మార్పులు చేశారని, అందుకే చిత్రీకరణ ఆలస్యం అవుతోందని వివరించారు. దాంతో అల్లు అర్జున్ తదుపరి సినిమాలపైనా ఈ ప్రభావం పడిందని, ఆయన తన కొత్త ప్రాజెక్టులను ఈ నెలలో ప్రకటించే అవకాశం ఉందని బన్నీ వాసు తెలిపారు. 

పుష్ప-2 ఈ ఏడాది డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రావడం దాదాపు ఖాయమేనని అన్నారు. ఈ చిత్రం ప్రస్తుతం ఎడిటింగ్ పనుల్లో ఉందని పేర్కొన్నారు.

Pushpa-2
Allu Arjun
Sukumar
Bunny Vas
Tollywood

More Telugu News