భారత్ తయారు చేసిన ఈ గన్ ప్రపంచంలో మరే దేశం వద్ద లేదు: సతీశ్ రెడ్డి
- రక్షణ పరిశోధన రంగంలో భారత్ పూర్తి స్వావలంబన సాధించిందన్న సతీశ్ రెడ్డి
- 155ఎంఎం గన్ ప్రపంచంలోని మరే దేశంలో లేదని వ్యాఖ్య
- త్వరలో రూ.80వేల కోట్ల స్థాయికి రక్షణ రంగ ఎగుమతులు చేరతాయని వెల్లడి
కృష్ణాజిల్లా నిమ్మకూరులో ఏర్పాటు చేసిన బెల్ కంపెనీ ద్వారా త్వరలో ప్రపంచానికి ఎగుమతులు ఉంటాయని చెప్పారు. నాగాయలంక మండలం గుల్లలమోద గ్రామంలోని క్షిపణి కేంద్ర నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని తెలిపారు. బెల్ కంపెనీ, నాగాయలంకలో ఏర్పాటు చేస్తున్న క్షిపణి పరీక్ష కేంద్రం ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. కాగా, భారత రక్షణ శాస్త్రవేత్తగా పని చేస్తున్న సతీశ్ రెడ్డి .. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు.