విశాఖలో ప్లాట్‌ఫాంపై ఆగి ఉన్న రైలులో చెలరేగిన మంటలు.. వీడియో ఇదిగో!
షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్టు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. బీ7 బోగీ పూర్తిగా దగ్ధం కాగా, బీ6, ఎం1 బోగీలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఘటన సమయంలో రైలులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు అదుపు చేశారు.