ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్
- వచ్చే నెల నుండి బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు పంపిణీ
- కందిపప్పు, పంచదార పంపిణీకి చర్యలు
- రేషన్ పంపిణీలో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు
పేదలకు అందాల్సిన రేషన్ బియ్యంను వైసీపీ పెద్దలు దారి మళ్లించి కోట్లాది రూపాయల అక్రమాలు చేశారని విమర్శించారు. పేదలకు అందాల్సిన రేషన్ లో అవినీతి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వచ్చే నెల నుండి బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులను రేషన్ కార్డులకు పంపిణీ చేస్తామని చెప్పారు. బియ్యం డోర్ డెలివరీ పేరుతో చేపట్టిన విధానం లోపభూయిష్టంగా ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గత ప్రభుత్వ చర్యల వల్ల పౌర సరఫరాల శాఖకు భారీగా నష్టం జరిగిందని ఆయన విమర్సించారు. డోర్ డెలివరీ పేరుతో ఎండీయూ వాహనాలు ఏర్పాటు చేసినా ఎక్కడా డోర్ డెలివరీ జరగడం లేదని మంత్రి నాదెండ్ల అన్నారు.
శాంతి భద్రతల విషయంలో ఏ పార్టీ అయినా చర్యలు ఒకేలా ఉంటాయని మంత్రి నాదెండ్ల అన్నారు. కూటమికి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరూ ఉచిత ఇసుక విధానంలో జోక్యం చేసుకోవద్దని ఆయన హితవు పలికారు.