అరెస్ట్ భయంతో దుబాయ్‌కు పూజాఖేద్కర్ పరారీ?
- తప్పుడు ధ్రువీకరణ పత్రాల కేసులో పూజాఖేద్కర్‌పై ఆరోపణలు
- ముందస్తు బెయిలుకు ఢిల్లీ కోర్టు నిరాకరణ
- గాలిస్తున్న పోలీసులు.. ఫోన్ స్విచ్ఛాఫ్
- మరో ఆరుగురి వైకల్య పత్రాలపైనా యూపీఎస్సీ అనుమానం
మరోవైపు, పూజ వివాదం నేపథ్యంలో మరో ఆరుగురు ఐఏఎస్ అధికారుల వైకల్య పత్రాలపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర సిబ్బంది, శిక్షణశాఖ (డీపీటీవో) వారి పత్రాలను పరిశీలించనున్నట్టు సమాచారం. కాగా, ఇటీవల పూజ ప్రొవిజనల్ అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ రద్దు చేసింది. తమ ఎదుట హాజరు కావాలన్న ఆదేశాలను ఉల్లంఘించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, భవిష్యత్తులోనూ ఆమె యూపీఎస్సీ పరీక్షలు, నియామకాల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది.