శ్రీశైల మల్లన్న ఆలయంలో అపచారం.. మద్యం తాగి వచ్చిన ఉద్యోగి.. భక్తుల దేహశుద్ధి
- మద్యం తాగి విధులకు హాజరైన ఉద్యోగి
- పట్టుకుని చితకబాది నిరసన తెలిపిన భక్తులు
- ఈ ఉదయం ఆలయ ఈవోకు ఫిర్యాదు
ఆందోళనపై సమాచారం అందుకున్న సహాయ కార్య నిర్వాహక అధికారి జి.స్వాములు అక్కడికి చేరుకుని భక్తులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. ఆయనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది మద్యం తాగి విధులకు వస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆలయ పవిత్రతను కాపాడడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటనపై ఈ ఉదయం ఈవో పెద్దిరాజుకు భక్తులు ఫిర్యాదు చేశారు.