బస్సులో అత్యాచారం ఘటన... ఇద్దరు నిందితుల అరెస్ట్
- తనపై అత్యాచారం జరిగినట్లు బాధితురాలు అర్ధరాత్రి ఫిర్యాదు చేశారన్న డీసీపీ
- నిందితులను నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన వారిగా గుర్తించామని వెల్లడి
- నిందితులను ఈ రోజు రిమాండ్ చేస్తున్నామన్న డీసీపీ
సంగారెడ్డి నుంచి వస్తుండగా చేగుంటలో భోజనం చేశారని, అక్కడి నుంచి సిద్ధయ్య బస్సును డ్రైవ్ చేసినట్లు చెప్పారు. కృష్ణబాబు బాధితురాలిని రేప్ చేస్తే... సిద్ధయ్య సహకరించాడన్నారు. బాధితురాలితో మాటలు కలిపి అఘాయిత్యానికి పాల్పడినట్లు చెప్పారు.
బాధితురాలు తన కూతురుతో ప్రయాణిస్తోందని, ఒకే బెర్త్ బుక్ చేసుకుందన్నారు. అయితే వెనక్కి వెళ్లాలని నిందితుడు... కూతురుకు చెప్పాడన్నారు. నిన్ననే యాచారం స్టేషన్ పరిధిలో నిందితులను అరెస్ట్ చేశామన్నారు. బాధితురాలి భర్త ఏడేళ్ల క్రితం మరణించినట్లు చెప్పారు. నిందితులను ఈ రోజు రిమాండ్ చేస్తున్నామన్నారు.