Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కుమారుడి పుట్టిన రోజు.. హార్దిక్ పాండ్యా భావోద్వేగం!

Hardik Pandyas Heartfelt Note to Son Agastya on His Fourth Birthday
Advertisement
  • పుట్టినరోజున కుమారుడి వీడియోను షేర్ చేసిన పాండ్యా
  • కొడుకుపై తన ప్రేమ మాటలకందనిదని భావోద్వేగం
  • తండ్రికి అగస్త్య ఫ్లయింగ్ కిస్‌లు చూసి మురిసిపోతున్న అభిమానులు
Advertisement
టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన కుమారుడు అగస్త్య పుట్టిన రోజు వేడుకల వీడియోను నెట్టింట పోస్టు చేశాడు. నీపై నాకున్న ఆపేక్ష మాటలకందనిదని భావోద్వేగ పూరిత కామెంట్ చేశాడు. హార్దిక్ కుమారుడు తాజాగా తన నాల్గవ పుట్టిన రోజును జరుపుకున్నాడు. ఈ సందర్భంగా హార్దిక్ తన కుమారుడిని చూసి మురిసిపోయాడు. చిన్నారిని చూస్తూ ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చాడు. అగస్త్య కూడా తండ్రిని అనుకరిస్తూ ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చాడు. 

ఈ తండ్రీతనయుల వీడియో జనాలకు కూడా బాగా నచ్చడంతో లక్షల కొద్దీ వ్యూస్, వేల కొద్దీ కామెంట్స్ వచ్చి పడ్డాయి. హార్దిక్ ఓ అదర్శవంతమైన తండ్రి అని కొందరు అన్నారు. పలువురు చిన్నారికి కూడా శుభాకాంక్షలు తెలిపారు. 

హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిక్ ఇటీవలే తమ వైవాహిక బంధానికి ముగింపు పలికిన విషయం తెలిసిందే. 2020లో ఈ జంటకు పెళ్లి కాగా, ఆ తరువాత వారు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. తాజాగా వారు తమ నాలుగేళ్ల దాంపత్య బంధానికి ముగింపు పలుకుతున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇదిలా ఉంటే, నటాషా కూడా ఈ మధ్య కాలంలో తన కుమారుడికి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలను నెట్టింట పంచుకుంది. ఇటీవల తల్లీకొడుకులు ఓ డైనోసార్ థీమ్ పార్క్‌ను సందర్శించిన సందర్భంగా తీసిన ఫొటోలను నెట్టింట షేర్ చేసింది.
Advertisement
Advertisement
Hardik Pandya
Agasthya Pandya

More Telugu News