అక్బరుద్దీన్‌కు దమ్ముంటే కొడంగల్ బరిలో నిలవాలి.. బండి సంజయ్ సవాల్
- ఎంఐఎం గోడ మీద పిల్లిలాంటి పార్టీ అంటూ బండి సంజయ్ ఫైర్
- ఎవరు అధికారంలో ఉంటే వారి పంచన చేరుతారని ఎద్దేవా
- కొడంగల్ నుంచి పోటీ చేస్తే డిపాజిట్ కూడా దక్కనివ్వబోమని హెచ్చరిక
తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో బోనాల పండుగకు ప్రభుత్వం రూ. 5 లక్షలు మాత్రమే ఇస్తే, రంజాన్ పండుగకు రూ. 33 కోట్లు ఇచ్చిందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మారుస్తామని చెప్పారు.