కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారు... అవకాశవాద పార్టీలు: బండి సంజయ్
- బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి కాంగ్రెస్ అప్పులు తెచ్చే కుట్రలు చేస్తోందని విమర్శ
- దీంతో రాష్ట్ర ప్రజలపై మోయలేని భారం పడుతుందని ఆందోళన
- ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ జరగాలని డిమాండ్
అసెంబ్లీ బడ్జెట్, కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు... అన్నీ గాడిద గుడ్డే అన్నారు. 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలూ గాడిద గుడ్డే అన్నారు. నీతి అయోగ్ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకాకపోవడం దుర్మార్గమన్నారు. భారత్‌ను నెంబర్ వన్‌గా తీర్చిదిద్దడం, కేంద్ర రాష్ట్ర సంబంధాల బలోపేతమే లక్ష్యంగా నీతి అయోగ్ సమావేశం జరుగుతుందన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అవకాశవాద పార్టీలు అని విమర్శించారు. అవకాశం వస్తే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవడం ఖాయమని జోస్యం చెప్పారు. కాళేశ్వరంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి డ్రామాలు ఆడుతున్నాయన్నారు.