పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- పంచాయతీ ఎన్నికలకు త్వరగా ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు
- ఆగస్ట్ మొదటి వారంలోగా కొత్త ఓటర్ జాబితాను పూర్తి చేయాలన్న సీఎం
- నిర్దిష్ట గడువులోగా రిజర్వేషన్ అంశంపై నివేదిక ఇవ్వాలని బీసీ కమిషన్‌కు ఆదేశాలు
శుక్రవారం ఆయన పంచాయతీరాజ్ వ్యవస్థపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆగస్ట్ నెలాఖరు నాటికి పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. సర్పంచ్‌ల పదవీకాలం ముగిసి 6 నెలలు కావొస్తోంది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలపై ఆయన చర్చించారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కే కేశవరావు తదితరులు పాల్గొన్నారు.