జగన్ టైమ్ వేస్ట్ చేసుకుంటున్నారు: టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి
- ఢిల్లీలో జగన్ ఆధ్వర్యంలో వైసీపీ ధర్నా
- జగన్ సొంత నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తే బాగుంటుందన్న శబరి
- గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేశారని వ్యాఖ్యలు
- ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ముఖం చూపించలేకపోతున్నారని విమర్శలు
జగన్ గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే అక్కడ ముఖం చూపించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. రోడ్డు ప్రమాద ఘటనలను కూడా జగన్ రాజకీయం చేస్తున్నారని శబరి విమర్శించారు.
ఏపీలో శాంతిభద్రతలు దెబ్బతింటున్నాయని, ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని జగన్ డిమాండ్ చేస్తున్నారని... జగన్ కు క్రిమినల్స్ అందరూ మద్దతిస్తున్నారని మండిపడ్డారు.