ఫర్నిచర్ గోదాములో భారీ అగ్నిప్రమాదం.. తీవ్రంగా గాయపడిన వారి పరిస్థితి విషమం
- హైదరాబాద్‌లోని జియాగూడ పరిధిలో ఘటన
- చిక్కుకున్న 20 మందిని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది
- తీవ్రంగా గాయపడిన ఆరుగురికి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స
- ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణం!
గోదాములో చిక్కుకున్న 20 మందిని రక్షించారు. వారిలో తీవ్రంగా గాయపడిన ఆరుగురిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.