ఆంధ్రప్రదేశ్ ను జగన్ అరాచకప్రదేశ్ గా మార్చారు: భానుప్రకాశ్ రెడ్డి
- ఢిల్లీలో ధర్నా చేస్తానని జగన్ చెప్పడంపై భానుప్రకాశ్ రెడ్డి విమర్శలు
- వైసీపీ హయాంలో జరిగిన దాడులపై మాట్లాడాలని డిమాండ్
- విధ్వంసాలకు పాల్పడిన ఏ వైసీపీ నేతను వదలబోమని హెచ్చరిక
ఢిల్లీలో ధర్నా చేస్తానని జగన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని భానుప్రకాశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దాడులు, దారుణాలపై ధర్నాలో జగన్ మాట్లాడాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీలో జరిగిన అరాచకాలు దేశంలోనే చర్చనీయాంశంగా మారాయని చెప్పారు. చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొందని చెప్పారు.