భద్రాచలం వద్ద 30 అడుగులు దాటిన గోదావరి నీటిమట్టం
- తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు
- 20 గేట్లను ఎత్తి 66 వేల 900 క్యూసెక్కుల వరద నీరు విడుదల
- 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
గద్వాల జిల్లా జూరాల ప్రాజెక్టుకు వరద నీరు పెరుగుతోంది. అధికారులు 5 గేట్లను ఎత్తారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 70 వేలు, ఔట్ ఫ్లో 32,267 క్యూసెక్కులుగా ఉంది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాం సాగర్ ప్రాజెక్టులోకి 18,275 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా, 1066 అడుగులకు చేరుకుంది. భారీ వర్షాలతో తెలంగాణలోని చెరువులు నిండుకుండలా కనిపిస్తున్నాయి.